ఉద్యోగం కేవలం వృత్తి కాదు,,, బాధ్యత

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజల రక్షణే పరమావధిగా భావించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసిన ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తమ సుదీర్ఘ సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందడం సంతోషకరమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.శనివారం ఇస్నాపూర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది ఒక బాధ్యత, ఒక కర్తవ్యం, సమాజం పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక అని, ఎండనక, వాననక, పండుగనక, సెలవనక ప్రజల భద్రత కోసం నిరంతరం పోలీస్ పని చేస్తారన్నారు.తమ విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, క్రమశిక్షణకు మారుపేరుగా,న్యాయానికి నిబద్ధులై ప్రజలకు సేవలందించారని, తమ అనుభవంతో సహచరులకు మార్గదర్శకులుగా నిలిచి, ప్రజలలో భద్రతా భావాన్ని కల్పిస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచారని, ఒక అధికారి పదవీ విరమణ పొందవచ్చు కానీ ఆయన అందించిన సేవలు, చేసిన మంచి పనులు, సంపాదించుకున్న గౌరవం ఎప్పటికీ పదవీ విరమణ పొందవని తెలియజేశారు. ఆయన జీవితం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *