వేముకుంట మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

వేముకుంట గౌతమినగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తుషార్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో కలిసి ఆటపాటల్లో సందడి చేశారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు.చుట్టుపక్కల కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం సుమారు 200 మంది మహిళలు గంగారం చెరువు వద్దకు చేరుకుని బతుకమ్మలకు హారతి ఇచ్చి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతి లక్ష్మి, సునీత, దీప, నీరజ, అనూష, బిందు, రుక్కమ్మ, కవిత తదితర మహిళలతో పాటు గౌతమినగర్ కాలనీ అధ్యక్షుడు ప్రసాద్ రావు, కార్యదర్శి శివప్రసాద్, గాంధీ చౌదరి, ముక్తేశ్వర్ రావు, శేఖర్ రెడ్డి, శ్రీకాంత్, రామాంజనేయులు, జగదీశ్, కిషన్ సింగ్, యాదయ్య, శ్రీను పాల్గొన్నారు. దేవాలయ అర్చకులు మహేశ్వర్ ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *