పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రకృతిని దైవంగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని యూరో కిడ్స్ స్కూల్ చైర్మన్ గాదే మహేష్ అన్నారు .పటాన్చెరు యూరో కిడ్స్ స్కూల్ లో శనివారం బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ గాదే మహేష్, ప్రధాన ఉపాధ్యాయులు గాదే సంజన మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు .రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను పాఠశాల ఆవరణలో ఉంచి, విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్లు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ కోలాటం ఆడారు.అనంతరం చైర్మన్ గాదే మహేష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ పండుగ మరియు విజయదశమి {దసరా} ప్రకృతిని దైవంగా భావించి పూజించే గొప్ప పండుగలను విద్యార్థులకు పరిచయం చేయడం, మన సాంప్రదాయాలను తరువాతి తరాలకు అందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం” అని తెలిపారు. యూరో కిడ్స్ స్కూల్ ఆవరణలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో బతుకమ్మ సంబరాలను మరియు విజయదశమి రోజున జరిపే మహిషాసుర వర్ధిని కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంట సంతోషాన్ని ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.
