ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బండలగూడలోని మార్క్స్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య చికిత్స పొందాలని సూచించారు.సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, చంద్రశేఖర్, అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *