పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
భారత మాజీ ఉప ప్రధాని, దేశంలో సామాజిక న్యాయ సాధనకు అవిరళ కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి స్థానిక మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు.
