ఎమ్మెల్యేను కలిసిన టీయూడబ్ల్యూజే–ఐజేయూ నూతన కార్యవర్గం

politics Telangana

జర్నలిస్టులకు అండగా ఉంటా  ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హామీ

 మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గ టీయూడబ్ల్యూజే–ఐజేయూ నూతన కార్యవర్గం గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు పత్తి నర్సింహా ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పత్తి నర్సింహా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సంఘం కార్యక్రమాలకు ఎమ్మెల్యే సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి స్పందిస్తూ జర్నలిస్టులకు, టీయూడబ్ల్యూజే–ఐజేయూకు తనవంతు సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పర్చ శ్రీనాథ్, పటాన్‌చెరు నియోజకవర్గ సలహాదారులు కాశిపతి, సులేమాన్, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కమిటీ భాద్యులు శ్రీనివాస్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాజిద్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు విట్టల్, రఘరాంరెడ్డి, రాజు, నాగేష్, జీవరత్నం, సంయుక్త కార్యదర్శులు శ్రీనివాస్, ప్రభాకర్, కోటెశ్, ఆర్గనిసింగ్ సెక్రటరీలు రాజు, వివేక్, శ్రీనివాస్, శంకర్, శేఖర్, మహేందర్ గౌడ్, సిద్దు, శ్రీనివాస్, నాయుడు, పురుషోత్తం, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *