పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన కమ్మరి సుజాత, రామచంద్రాపురానికి చెందిన బండి సుజాతలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వారికి మంజూరైన 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాలను శనివారం ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహా, తదితరులు పాల్గొన్నారు.
