మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ :
రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్లోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నగర్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువతను అభినందించారు. ముఖ్యంగా టీమ్ పవన్ పుత్ర సభ్యులు ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, దయాకర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, శ్రీశైలం, గుడ్ల సాగర్, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్ యాదవ్, మోహన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు బొల్లారం శ్రీశైలం, గోపాల్ యాదవ్, మల్లేష్, ప్రభు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టీమ్ పవన్ పుత్ర సభ్యులు పాల్గొన్నారు.
