పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
నూతన వ్యాపార, ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారానే స్థానిక ప్రజలకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందుతాయని బీఆర్ఎస్ ఇంఛార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వ్యాపార, ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలుక నాణ్యమైన సేవలతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని ఆకాంక్షించారు. కొత్త సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రజలు రుణాలు, పొదుపు పథకాలు ,ఇతర బ్యాంకింగ్ సేవల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందన్నారు. మణప్పురం ఫైనాన్స్ సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపడంతో పాటు సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బబుల్ రెడ్డి ,ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ మచ్చ కిషోర్ రెడ్డి ,కో ఆప్షన్ సభ్యులు బాబా నిజముద్దీన్ ,బీఆర్ఎస్ నాయకులు వీరేష్ గౌడ్ రు,లక్ష్మణ్ గౌడ్ ,సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
