మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ :
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్‌కు చెందిన దాసు ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి మృతుడి కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ నాయకులు కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన చేసిన ఈ సహాయాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకులు కోటేష్ నాయక్, ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
