మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
వెంకట్ రెడ్డి కాలనీ లో అసంపూర్తిగా ఉన్న ఓపెన్ డ్రైనేజీ సమస్య పరిశరించాలని కోరుతూ స్థానిక ప్రజలతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ సోమవారం రోజు జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. కాలనీలో అసంపూర్తిగా వదిలిపెట్టిన ఓపెన్ డ్రైనేజీ కారణంగా తీవ్ర దుర్వాసన వ్యాపిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ ప్రాంతం నివసించడానికి అనర్హంగా మారిందని స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు నిత్యం అనారోగ్యకర పరిస్థితులనుఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీటి దుర్వాసనతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ప్రజల తరఫున వెంటనే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ఫిర్యాదుపై స్పందించిన జోనల్ కమిషనర్ కార్యాలయ అధికారులు 10 రోజుల్లో సమస్యకు పరిష్కారం కనుగొని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అశోక్, శ్రీధర్, ప్రభాకర్, జ్ఞానేశ్వర్, ఆకాశ్, దశరథ్, కిరణ్, ముక్తేదార్, సలీమ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.
