గీతం కె.ఎస్.పి.పి.ని సత్కరించిన తెలంగాణ పోలీసు అకాడమీ

politics Telangana

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తరఫున జ్జాపికను స్వీకరించిన రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

వృత్తిపరమైన శిక్షణ, ప్రజా సేవ రంగాలలో 40 ఏళ్ల ఘనమైన సేవను పూర్తిచేసుకున్న సందర్భంగా, రాజా బహదూర్ వెంకట రామరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీ (ఆర్బీవీఆర్ఆర్ టీజీపీఏ) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి.)ని ఒక స్మారక చిహ్నంతో సత్కరించింది.హైదరాబాదులోని తెలంగాణ పోలీసు అకాడమీ ప్రాంగణంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో, తెలంగాణ గౌరవ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ స్మారక చిహ్నాన్ని గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్, పూర్వ సంచాలకుడు పి.ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోలీసు అకాడమీ తాము కొనసాగిస్తున్న విద్యాపరమైన సహకారాలు, సంస్థాగత భాగస్వామ్యాలను గుర్తించి, యునిసెఫ్, ఐఐటీ హైదరాబాదు, జేఎన్టీయూ హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ వంటి పలు ప్రముఖ సంస్థలను కూడా సత్కరించింది.సుపరిపాలన, విధాన విద్య, పరిశోధన, నాయకత్వ అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం వంటి అంశాలను ప్రోత్సహించడంలో విద్యా సంస్థలకు, ప్రజా సేవా సంస్థలకు మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చాటి చెప్పింది. సమాజ, సంస్థాగత పురోగతికి దోహదపడే అర్థవంతమైన సహకారాలను పెంపొందించడంలో కె.ఎస్.పి.పి.కి ఉన్న నిబద్ధతను ఈ సన్మానం మరింత బలోపేతం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *