ముఖ్య అతిథులుగా జగదీశ్వర్ గౌడ్,యలమంచి ఉదయ్ కిరణ్
యువ క్రికెటర్లలో ఉత్సాహాన్ని నింపిన ఇపిఎల్ తరహా ప్లేయర్స్ ఆక్షన్
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
యువత సరైన దిశలో సాగేందుకు క్రీడలే బలమైన మార్గం అని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు .మియాపూర్‌లోని నీలిమా గ్రీన్స్ వేదికగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ అకాడమీ (సీఓఈసి) మరియు యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇపిఎల్ సీజన్ – 3 ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు.యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఇపిఎల్ టోర్నమెంట్ ఇప్పటికే స్థానిక యువ క్రికెటర్లకు ప్రతిష్టాత్మక వేదికగా నిలిచింది.ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా ఐపిఎల్ తరహాలో నిర్వహించిన ప్లేయర్స్ ఆక్షన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా A+, A, B విభాగాలుగా వర్గీకరించి నాలుగు జట్లలో ఎంపిక చేయడం ద్వారా ప్రొఫెషనల్ లీగ్ వాతావరణాన్ని సృష్టించారు. ఈ వినూత్న విధానం యువ ఆటగాళ్లలో అపార ఉత్సాహం, పోటీతత్వాన్ని పెంపొందించింది.అనంతరం శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు పోరాటస్ఫూర్తిని పెంపొందిస్తాయి. యువ క్రికెటర్లకు ఇలాంటి అద్భుతమైన వేదికను అందిస్తున్న సీఓఈసి అకాడమీ నిర్వాహకులు అభినందనీయులు. సమాజ సేవతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్న శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ సేవలు యువతకు స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.అలాగే అకాడమీ వ్యవస్థాపకులు మనస్ ముట్టవరపు , కోచ్‌లు దివాకర్ మరియు విష్ణు యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు చేస్తున్న కృషిని ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో రావిపాటి కోటేశ్వరరావు, రావిపాటి వెంకటేశ్వరరావు, అశోక్, అమర్నాథ్, రామ్‌చందర్ గౌడ్, రవి, శ్రీకాంత్, వాసు, దినేష్, గిరి, గురువులు, రాకేష్, శరత్, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, నాగసాయి, రత్నాచారి, సాయి నిఖిల్, రాజేష్, వినోద్, వినయ్, శివ తదితరులు పాల్గొన్నారు.

