రాయసముద్రం చెరువు వద్ద వైభవంగా ఛట్ పూజ వేడుకలు

politics Telangana

-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పటాన్‌చెరు బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి

-అన్ని వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

-భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించిన భక్తులు

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి:

రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద ఛట్ పూజ మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా జరిగాయి. సూర్యభగవానుడిని మరియు ఛట్ మైయాను ఆరాధిస్తూ నిర్వహించిన ఈ పవిత్ర వేడుకలకు పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెరువు తీరానికి చేరుకున్న ఆయనకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ఉత్తర భారతీయ సంఘాల ప్రతినిధులు మరియు భక్తులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదర్శ్ రెడ్డి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సూర్యభగవానుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని, జీవకోటికి ప్రాణాధారమైన సూర్యభగవానుడిని ఆరాధించే ఛట్ పూజ ఎంతో విశిష్టమైనదని, పవిత్రమైనదని కొనియాడారు. కఠినమైన ఉపవాస దీక్షలతో, అత్యంత నియమనిష్ఠలతో ఈ పండుగను జరుపుకుంటున్న ఉత్తర భారతీయ సోదర సోదరీమణులకు, భక్తులందరికీ ఆయన హృదయపూర్వక ఛట్ పూజ శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్, పటాన్‌చెరు ప్రాంతాలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలని, ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరి పండుగలను, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, వారి ఆచార వ్యవహారాలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఆ సూర్యభగవానుడి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం చెరువు వద్ద భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. భక్తులతో కలిసి కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, పరమేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, అప్పల భాస్కర్, సంజయ్ సింగ్, సన్నీ, రాజ్ కుమార్, అమిత్ కుమార్‌లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఛట్ పూజ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *