సమష్టి కృషితో సత్తాచాటిన క్రీడాకారులు
జట్టు సభ్యులను అభినందించిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ యాజమాన్యం
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
కరీంనగర్లో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2026–27 రాష్ట్రస్థాయి అండర్–17 బాస్కెట్బాల్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. జట్టు సభ్యులందరూ సమష్టి కృషి, అద్భుతమైన ఆటతీరు, పరస్పర సమన్వయంతో ప్రతిభ కనబరిచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సందర్భంగా జట్టులో ప్రాతినిధ్యం వహించిన పటాన్చెరులోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థిని కె.వి.ఎన్.ఎస్. హరిణితో పాటు జట్టు సభ్యులందరినీ పాఠశాల యాజమాన్యం అభినందించింది. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల సహకారాన్ని, శిక్షణ అందించి విజయంలో కీలక పాత్ర పోషించిన బాస్కెట్బాల్ కోచ్ షేక్ అక్బర్ కృషిని ప్రశంసించింది. భవిష్యత్తులో మెదక్ జిల్లా జట్టు మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిం చారు.
