సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

Telangana

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి హెచ్.వి. రమణారావు డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డీప్ లెర్నింగ్ మోడళ్ల మూల్యాంకనంతో పాటు, ఏకీకృతం చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రేడింగ్ ను మెరుగుపరచడం’పై ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రవిశంకర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.తన మార్గదర్శనంలో, హిస్టోపాథలాజికల్ చిత్రాలను ఉపయోగించి ప్రోస్టేట్ క్యాన్సర్ ను స్వయంచాలకంగా గుర్తించడం, గ్రేడింగ్ చేయడాన్ని మెరుగుపరచడానికి డాక్టర్ రమణారావు అధునాతన డీప్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేసినట్టు తెలియజేశారు. ఆయన పరిశోధనలో కన్వల్యూషనల్ న్యూరల్ నెట్ వర్కులు, విజన్ ట్రాన్స్ ఫార్మర్లను ఏకీకృతం చేసి, 98.8 శాతం వర్గీకరణ కచ్చితత్వాన్ని సాధించారని, ఇది కచ్చితమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన క్యాన్సర్ నిర్ధారణకు మద్దతు ఇచ్చే గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించారు.డాక్టర్ రమణారావు సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి సయ్యద్ అక్బరుద్దీన్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర ఎస్.మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించి, ఆయన తన విద్య, పరిశోధన వృత్తిలో నిరంతర విజయం సాధించాలని వారు ఆకాంక్షించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *