నాగుల చవితి సందర్భంగా మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

Hyderabad politics Telangana

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజు కార్తీక మాసం సందర్భంగా గౌతమినగర్‌లోని వేముకుంట లో గల శ్రీశ్రీశ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో నాగదేవతకు ప్రత్యేక పూజలు, పాలు పోసే కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ట్రస్టీలు గుర్రపు విజయలక్ష్మి రవీందర్ రావు లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, నరేందర్ బిల్లా తదితరులు పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి, పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుడు మహేశ్వరయ్య భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌతమినగర్ కాలనీ అధ్యక్షుడు ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, రామాంజనేయులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *