5జీ, డ్రోన్ సాంకేతికతలపై అవగాహన

Telangana

నిపుణులతో మూడు రోజుల కార్యశాలను నిర్వహించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

అధునాతన సాంకేతికలైన 5జీ, డ్రోన్ టెక్నాలజీలపై అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులకు అవగాహన కల్పించడానికి గాను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మూడు రోజుల హైబ్రిడ్ కార్యశాలను ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించింది. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కు చెందిన సీఎస్&ఎస్ఈ, ఏఐ&డీఎస్ విభాగాలు దీనిని ఏర్పాటు చేశాయి. 5జీ కమ్యూనికేషన్, మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), కృత్రిమ మేధస్సు (ఏఐ), ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇందులో పాల్గొనేవారికి సమగ్రమైన సైద్ధాంతిక పరిజ్జానం, ఆచరణాత్మక అనుభవాన్ని అందించడమే ఈ కార్యశాల లక్ష్యం.ఈ వర్క్ షాపులో 5జీ ఆర్కిటెక్చర్, డ్రోన్ భాగాలు, వ్యవస్థలు, కమ్యూనికేషన్ టెక్నాలజీలు, ఏఐ-ఆధారిత ఆబ్జెక్ట్ డిటెన్షన్, అటానమస్ నావిగేషన్, మిషన్ ప్లానింగ్ వంటి కీలక అంశాలను వివరిస్తూ నిపుణుల నేతృత్వంలో సాంకేతిక కార్యక్రమాలు, హ్యాండ్స్-ఆన్ ప్రదర్శనలు జరిగాయి. ఇది స్మార్ట్ వ్యవసాయం, స్మార్ట్ నగరాలు, విపత్తు నిర్వహణ వంటి అభివృద్ధి చెందుతున్న అనువర్తన రంగాలలో అంతర్ విషయ బోధన, పరిశోధన, ఆవిష్కరణలకు కూడా ప్రాధాన్యతనిచ్చింది.

ఇందులో పాల్గొనేవారికి 5జీ కమ్యూనికేషన్ టెక్నాలజీలు, యూఏవీ వ్యవస్థలను అర్థం చేసుకోవడం, డ్రోన్ కార్యకలాపాలు, మిషన్ ప్రణాళికపై ఆచరణాత్మక అవగాహన పొందడం, తెలివైన డ్రోన్ అనువర్తనాల కోసం ఏఐ, కంప్యూటర్ విజన్, ఎడ్జ్ కంప్యూటింగ్ లను ఒకతాటిపై నడిపించే మార్గాలను అన్వేషించడం, ఇంకా పరిశోధనలు చేపట్టడానికి ఉన్న అవకాశాలు, అంతర్ విభాగ ప్రాజెక్టులను గుర్తించడం వంటి అంశాలపై దృష్టి సారించింది.ఈ మూడు రోజుల కార్యశాలలో ఐఐటీడీఎం కర్నూలుకు చెందిన డాక్టర్ ఎం. రవి కుమార్, డాక్టర్ పి. కిషోర్, డాక్టర్ కె. కృష్ణ నాయక్; ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి డాక్టర్ కె. జగదీష్; అహ్మదాబాదులోని ఐఐటీఆర్ఏఎం నుంచి డాక్టర్ అజిత్ కుమార్; బెంగళూరులోని ఐఐఎస్సీ ఆర్ట్ పార్క్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ రవిరాజ్ సక్సేనా; చండీగఢ్ లోని పీఈసీ డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ సిమ్రన్ జిత్ సింగ్, విశాఖప్నటంలోని గీతం నుంచి డాక్టర్ ఎన్.వి.ఆర్. స్వరూప్ కుమార్, డాక్టర్ కె. వెంకటేశ్వరరావు వంటి ప్రముఖ వక్తలు విలువైన అంతర్దృష్టులు, నైపుణ్యాలను అందించారు.

పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఈ మూడు రోజుల కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, ఆచరణాత్మక అనుభవాన్ని పొందడానికి, అలాగే 5జీ, డ్రోన్ టెక్నాలజీలలో అభివృద్ధి చెందుతున్న వృత్తి, పరిశోధనా అవకాశాలను అన్వేషించడానికి లభించిన ఈ అవకాశాన్ని వారు అభినందించారు. జ్జానాన్ని పెంపొందించే, నైపుణ్యాలను అభివృద్ధి చేసే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గీతం యాజమాన్యానికి వారు కృతజ్జతలను తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *