విద్యుత్ షాక్ తో కార్మికుడి మృతి

politics Telangana

అండగా నిలిచిన గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్..

విద్యుత్ శాఖ తరపున నష్టపరిహారం అందించేలా చర్యలు..

మృతి చెందిన కార్మికుడి పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మానవత దృక్పథంతో సహాయం అందించాలని వినతి..

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

తాను నివసిస్తున్న ఇంటివద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అండగా నిలిచారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వినయ్ కుమార్ (19) స్థానిక పారగాన్ పరిశ్రమలో కాంటాక్ట్ కార్మికుడుగా పని చేస్తూ బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన ఇంటి పైన గల విద్యుత్ తీగలు తాకడంతో కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ తో కలిసి ఘటన స్థలానికి వెళ్లి . కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్మికుడు పనిచేస్తున్న పారగాన్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. విద్యుత్ శాఖ తరపున నష్ట పరిహారం అందించాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *