భద్రకాళి సేవ సమితి ఆధ్వర్యంలో 23వ హనుమాన్ జయంతోత్సవం

Telangana

ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని అలవర్చుకోవాలి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

భద్రకాళి సేవ సమితి ఆధ్వర్యంలో 23వ హనుమాన్ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్మిక నాయకులు నర్ర బిక్షపతి, గూడెం మధుసూదన్ రెడ్డి, కోల్కూరి రామచంద్రారెడ్డి, మిద్దెల సుధాకర్ గౌడ్, ఎండిఆర్ యువసేన చైర్మన్ మాద్రి పృథ్వీరాజ్ హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .అనంతరం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ భద్రకాళి సేవ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను ప్రశంసించారు , ఇలానే ఇంకా ఎన్నో సేవాకార్యక్రమాలు కొనసాగించాలని ,ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు .

అనంతరం భద్రకాళి సేవా సమితి అధ్యక్షుడు వడ్ల కిట్టు మాట్లాడుతూ పటాన్ చెరులోని చెన్నకేశవ స్వామి ఆలయం సుమారు వెయ్యేళ్ల పురాతన చరిత్ర కలిగిన ఆలయమని తెలిపారు. 2004 సంవత్సరంలో హనుమాన్ జయంతి సందర్భంగా పులిహోర ప్రసాద వితరణతో ప్రారంభమైన సేవా కార్యక్రమం స్వామి వారి ఆశీర్వాదంతో ప్రస్తుతం 1000 మందికి అన్న ప్రసాదం అందించే స్థాయికి చేరుకుందని తెలిపారు, చెన్నకేశవ స్వామి, అభయ ఆంజనేయ స్వామివారి ఆశీర్వాదం తమపై ఎల్లప్పుడూ ఉండాలని, భద్రకాళి సేవ సమితి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో నిర్వహించే అవకాశం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు.అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు విజయవంతంగా చేయడానికి నాకు సహకరించిన మిత్రులకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు, అభయ ఆంజనేయ స్వామివారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *