వర్షాకాలానికి ముందే అంజయ్య నగర్ స్మశాన వాటిక పనులు పూర్తి చేయాలి – ఆంజనేయులు సాగర్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,  శేరిలింగంపల్లి :

అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ స్మశాన వాటిక పునరుద్ధరణ పనులను వర్షాకాలానికి ముందే అత్యవసరంగా చేపట్టాలని కోరుతూ డివిజన్ నాయకులు ఆంజనేయులు సాగర్ సిఎంసి కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సిఎంసి అడిషనల్ కమిషనర్‌ గీతా రాధిక ను కలిసి వినతిపత్రం అందజేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం స్మశాన వాటికలో ప్రజలు కర్మకాండలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని కోరారు.ఈ విషయంపై స్పందించిన అడిషనల్ కమిషనర్ గీతా రాధిక టెండర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపాడు.ఈ కార్యక్రమంలో అంజయ్య నగర్ కాలనీ అధ్యక్షులు నరసింహ సాగర్, జి రవి సాగర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *