సర్ సేవా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోంది

politics Telangana

ప్రజల కోసం 20వ రోజు కూడా నిరంతరంగా సేవలందించిన ఎండీఆర్ ఫౌండేష‌న్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రజలకు కనీసం సామాజిక అవసరాలు, సహాయం అందేలా చూడటం ప్రధాన లక్ష్యంగా ఎండీఆర్ ఫౌండేష‌న్ ప‌నిచేస్తుంద‌ని బీఆర్ఎస్ నాయ‌కులు, ఎండీఆర్ ఫౌండేష‌న్ కో ఫౌండ‌ర్ మాద్రి పృధ్వీరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో స్పెష‌ల్ ఇంటెన్షివ్ రివిన్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరు చేసేందుకు గ‌త 20 రోజులుగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ స‌ర్ పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నట్లు తెలిపారు .ప్రతి అర్హ‌త ఉన్న ఓట‌రు వివ‌రాలు స‌క్ర‌మంగా న‌మోదు కావాల‌నే ఉద్దేశంతో ప్ర‌త్యేకంగా విద్యార్థి వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేసి ఫారంల‌ను నింప‌డం, అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, న‌మోదు స్థితిని ప‌రిశీలించ‌డం సందేహాల‌కు స‌మాధానాలు ఇవ్వ‌డం వంటి సేవ‌లు అందిస్తున్నామ‌న్నారు.

ఎండీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌ర్ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు

ప‌టాన్ చెరు ప‌రిధిలోని కాల‌నీల్లో ఎండీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌ర్ హెల్ప్ డెస్క్ ల‌ను ఏర్పాటు చేసి ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు ఎండీఆర్ ఫౌండేష‌న్ కో ఫౌండ‌ర్ మాద్రి పృధ్వీరాజ్ వెల్ల‌డించారు. శ్రీనగర్, రాంకీ సింఫనీ, సింఫనీ పార్క్ హోమ్స్, ఏపీఆర్ లగ్జరియా, ప్రణీత్ ప్రణవ్ నైట్‌వుడ్స్, బండ్లగూడ గ్రామపంచాయతీ, శ్రీరామ్‌నగర్ కాలనీ, శాంతినగర్, రాఘవేంద్ర కాలనీ, మంజీరా స్కూల్ పరిసరాలు, గౌతమ్‌నగర్, మున్నూరుకాపు ఫంక్షన్ హాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎండీఆర్ ఫౌండేష‌న్ సర్ హెల్ప్ డెస్క్‌ల ద్వారా వేలాది మంది ప్రజలు సేవలు పొందుతున్నార‌ని తెలిపారు . ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేప‌డుతున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేయాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు . ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని.. ప్రతి అర్హత ఉన్న‌ ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడాల‌న్నారు. సర్ ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి సహాయం అవసరమైనా ఎండీఆర్ ఫౌండేష‌న్ ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.సర్ సేవా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోందని… ప్రజల కోసంఆగ‌స్ట్ మూడో తేదీ వ‌ర‌కు నిరంతరంగా ఎండీఆర్ ఫౌండేష‌న్ సేవ‌లు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *