తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని తీర్మానించారు. శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లికార్జున శర్మ ల సంయుక్త ఆధ్వర్యంలో* లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ శ్రీకరణ్ బ్యాంకెట్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమ కారులకు సన్మానం చేసి మెమెంటో తో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఉద్యమ కారులకు సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల స్వరాష్ట్రం లోనూ అన్యాయమే జరిగిందనీ సాక్షాత్తు అధిష్టాన వర్గం కూడా ఒప్పుకున్నధని గుర్తు చేశారు. పార్టీ కి పనిచేస్తూ ఉంటే పార్టీ ఏదో ఒక్క చోట ఈ సారీ అకామిడేట్ చేస్తుందనే నమ్మకం ఉందినీ చెప్పుకొచ్చారు.ఈ సారి అలా అందరం కలిసి కట్టుగా ఉంటూ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మన అభ్యర్థులను గెలిపించుకుందామని ముక్తకంఠం తో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారులు సామ వెంకట్ రెడ్డి, కే. శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, వెంకట్ యాదవ్, మల్లా రెడ్డి, నగేశ్ , విజయ లక్ష్మీ,, పలువురు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొబ్బ నవత రెడ్డి, మమత, రోజా,సతీష్ ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కార్తిక్, విజయ్ రెడ్డి, సంతోష్ నాయుడు, టి. సంతోష్ రెడ్డి మరియు సీనియర్, యువ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *