-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్
-ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం :
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.అనంతరం రామచంద్రాపురంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
