పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత యలమంచి ఉదయ్ కిరణ్

Lifestyle Telangana

పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి,మియాపూర్‌ :

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాంమని యలమంచి ఉదయ్ కిరణ్ అన్నారు .మియాపూర్‌లో సోదరుడు మన్నె నరేందర్ మరియు రమేష్ ఆధ్వర్యంలో మియాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రశాంత్ నగర్‌లోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నిర్వహించిన మట్టి గణపతి పాదయాత్రలో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మట్టి గణపతులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. భక్తిశ్రద్ధలతో సాగిన పాదయాత్రలో “మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పలు కాలనీ అసోసియేషన్ సభ్యులు, భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *