నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల భవిశ్యత్తు అంధకారమైందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి డిమాండ్ చేశారు .
సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున నిరసన దర్న చెప్పట్టారు అనంతరం పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నర్సింహ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీని ,ఎంపీ శ్రీమతి శ్రీ ప్రియాంకా గాంధీని డిల్లీలో విద్యార్ధులకు మద్దతుగా వారికి న్యాయం జరగాలని గాంధేయ మార్గంలో నిరసన చేస్తే అక్రమంగా అరెస్టు చేసి దౌర్జన్యానికి పాల్పడింది అని అన్నారు.

పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ ని రక్తం వచ్చే విధంగా బీజేపీ మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పై దాడులకు పాల్పడ్డారని ఇది చాలా దారుణమని అన్నారు .దేశంలో బీజేపీ మోదీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన 153 పరీక్షల్లో పరీక్షా పత్రాలు లిక్ కారణంగా ఈ ఒక్క సంవత్సరం 2026 లో ఒక్క నీట్ పరీక్ష పత్రం లిక్ తో కలత చెంది 22 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు 7 కోట్ల విద్యార్థుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వంఆటలాడుతున్నారని విమర్శించారు .

ఇప్పటికైనా కేంద్ర బీజేపీ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి ,మాజీ పిసిసి కార్యదర్శి మతిన్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు ముదిరాజ్, రవి ముదిరాజ్ ,యువజన కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ సింగ్, అక్షిత్ శ్రీనివాస్, ఐ ఎన్ టి సి నాయకులు రతన్ సింగ్, వినోద్ పవన్ సింగ్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి, కల్పన, ప్రభావతి, రాణి సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *