ఈ నెల 10న జరిగే జైల్ బరో ను జయప్రదం చేయాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరావు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ఈ నెల 10న జరిగే జైల్ బరో ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.శనివారం సిఐటియు ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో జరిగిన సదస్సులో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నేటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని,వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి, కార్మికుల హక్కులను పూర్తిగా హరించి వేస్తుందని,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలంబిస్తున్నాయన్నారు. కార్మికుల రోజువారి పని దినాన్ని ఎనిమిది గంటల నుండి 12 గంటలకు పెంచుకునేందుకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు అమలు అయితే కార్మికులు తమ స్వేచ్ఛను కోల్పోతారని, ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న ఆశ, అంగన్వాడి, మున్సిపల్, గ్రామపంచాయతీ, నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులకులు ఉద్యోగ భద్రత కరువైందని వాపోయారు. వామపక్షాలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వి బి జి రాంజీ చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చి, ఉపాధి హామీ పథకాన్ని హరించి వేసే విధంగా చేసుందని దీనివలన కార్మికులు తమకు దక్కవలసిన ఉపాధి హామీ పనులను కోల్పోవలసి వస్తుందన్నారు. అందుకోసం కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఆగస్టు 10న జరిగే జైల్ భరోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సతీష్, వీరేష్ చారి, స్వామి, గోపాల్,రవి, శ్రీనివాస్, సంజీవ్, రాము, ఆంజనేయులు, భూపాల్ రెడ్డి, రామచందర్, జయరాం, నవీన్ ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *