బోయిని లక్ష్మయ్య యాదవ్ 9వ వర్థంతి సందర్భంగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం విజయవంతం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో ఉన్న బి ఎల్ వై హోమ్స్ వద్ద ప్రముఖ సంఘసేవకులు కీర్తిశేషులు బోయిని లక్ష్మయ్య యాదవ్ 9వ వర్థంతి సందర్భంగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం, ఉచిత వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులు అందజేశారు.ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులచే ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యానికి సంబంధించిన పలు రకాల వైద్య పరీక్షలు, సలహాలు అందించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటు లేదా ప్రమాదాల బారిన పడిన వ్యక్తుల ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్ ఎలా చేయాలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఆర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను ఎలా రక్షించవచ్చో వైద్య నిపుణులు ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బోయిని లక్ష్మయ్య యాదవ్ గారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బోయిని శ్రీకాంత్ యాదవ్, మల్లేష్ యాదవ్, రాజేష్ యాదవ్, నాగుల్ పటేల్, దివాన్ యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ రమణయ్య, శ్రీశైలం కురుమ, శ్రీనివాస్ యాదవ్, రాజు గౌడ్, నాగులు పార్నంది, పాలెం శీను, సత్యనారాయణ రాజు, సురేష్ యాదవ్, రాజు ముదిరాజ్, శివ కురుమ, మహేష్ గౌడ్, ఆంజనేయులు చౌదరి, రామారావు, సుబ్బారావు అనేక మంది ప్రముఖ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *