యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు

politics Telangana

బీకే ఎంక్లేవ్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ అండ్ బిగ్ టీవీ సహకారం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ ,మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, యలమంచి ఉదయ్ కిరణ్
మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకేఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్ ,బీకే ఎంక్లేవ్ కాలనీ లో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు.ఈ మెడికల్ క్యాంపును ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్,టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ లు హాజరై ప్రారంభించారు. యలమంచి ఉదయ్ కిరణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గా మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ గా సేవలందిస్తూ సామాజిక సేవ పట్ల నిబద్ధతతో, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తు ప్రజల మన్ననలు అందుకుంటున్న మియాపూర్ కి చెందిన యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ,అనేక ప్రతిష్టాత్మక జాతీయ గౌరవాలను అందుకుని తెలంగాణకు, మియాపూర్‌కు గర్వకారణంగా నిలిచారు.

ప్రతీ వేసవిలో విశ్రాంతి కేంద్రాలు, అనుబంధ గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు 

యలమంచి ఉదయ్ కిరణ్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రజల హృదయాలను తాకుతూ, మియాపూర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతును పొందుతున్నాయి. అటు రాజకీయ రంగంలో కూడా అందరూ మన్ననలు పొందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గొప్ప పరిణామం అని,ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందించారు. యలమంచి ఉదయ్ కిరణ్ తన టీం సభ్యులు వారి సేవలను ఇంకా విస్తృత పరిచి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఎంతో మంది వ్యాధిని గుర్తించలేక వైద్యానికి దూరమవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని,రోగికి వచ్చిన వ్యాధిని గుర్తించలేక హాస్పిటల్‌కి వెళ్లే స్థోమత లేక దుర్భరమైన జీవితం గడుపుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని అలాంటి వారి కోసం యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని, నిర్వాహకులను,వైద్యులను అభినందించారు.

అనంతరం యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ లో వివిధ రకములైన సేవా కార్యక్రమాలకి నాకు సహకరించి ప్రోత్సహిస్తున్న ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి మా టీం తరుపున వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా అనేక మంది కి అవసరమైన వైద్య సహాయం అందించడంలో మా ప్రయత్నం విజయం సాధించింది. మియాపూర్ డివిజన్‌లోని ప్రజల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ హాస్పిటల్, యాజమాన్యానికి ఉచిత రవాణా మరియు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రజల ఆరోగ్యమేలుకు, మెరుగైన ఆరోగ్య పరిష్కారాలను అందించేందుకు చేసిన గొప్ప ప్రోత్సాహక చర్యలకు సహకారం అందిస్తున్న బిగ్ టీవీ మేనేజ్మెంట్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీకే ఎంక్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.సుమారుగా 300 లమంది పైగ వివిధ ఆరోగ్య పరీక్షలు ఈ క్యాంపులో చేయించుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైభవ్,రావిపాటి వెంకటేశ్వర్లు (అధ్యక్షులు), ధనుంజయ గారు (జనరల్ సెక్రటరీ), విజయ భాస్కర్,నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పద్మ, సాయి కృష్ణ, మోహన్ రెడ్డి, ఎంసీ రెడ్డి, కృష్ణ, కేవీరావు,మన్నేపల్లి సాంబశివరావు, రాంప్రభు,రవీందర్ రెడ్డి, మిర్యాల ప్రీతం, కుమార్, రాంచందర్, రవి, శ్రీనివాస్ ముదిరాజ్, సత్య రెడ్డి, కృష్ణ గౌడ్, శేఖర్ ముదిరాజ్, సింధూర, నవ్యశ్రీ, భాగ్య లక్ష్మి, శ్రీదేవి, జయ, నాజియా, విజయ, వెంకటేశ్వర్లు, బాబ్జీ,గోపాలకృష్ణ, ఎస్సీఆర్సీమూర్తి, శ్రీనివాసులు, సత్యనారాయణ, రాజేష్ ,మనీ, కార్తీక్, దినేష్ గౌడ్, గిరి, మహేందర్, లక్ష్మణ్ రావు, నరేందర్, శ్రీనివాస్, చక్రపాణి, రాజేశ్వరి, సిహెచ్ సాంబయ్య, బాల మురళి, నవీన్, సాయి కృష్ణ, సాధన, సత్య రెడ్డి, తాండ్ర రామచంద్ర గౌడ్, వెంకటేష్, శివ ముదిరాజ్ ప్రవీణ్, నాగ సాయి, నరేష్, వినోద్, వంశీ చౌదరి, వాసు కామినేని, సాయి నిఖిల్, రత్న చారి, నాగ సాయి బొబ్బ, మధు, శరత్, రాధా కృష్ణ, శివ ప్రసాద్, సర్దార్, నరేష్, కర్రి నాని,అశోక్ , నరేష్, దినేష్ గౌడ్, కార్తీక్,శ్రీను , రవి, వెంకటేష్, నరేష్, ఇరాన్ జగన్ రామస్వామి, కిరణ్, బండి రామకృష్ణ, సురేష్, నరేష్, సంజయ్, ధన్రాజ్, ప్రశాంత్, సల్మాన్, ఆసిఫ్, కరీం, మణిక్, శేఖర్, ప్రసాద్, రఘు, సత్యనారాయణ, వలభనేని నరసింహ రావు, ప్రకాష్, సత్య, శేషగిరి రావు మరియు అనేకమంది ప్రముఖులు ఘనంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *