తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్ర చిరస్మరణీయం
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి అన్నారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడిన చాకలి ఐలమ్మ వర్ధంతిని సాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పట్లోళ్ల పాండురంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన వీరోచిత పోరాటంలో ఐలమ్మ ధైర్యసాహసాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు.నిజాం నవాబు నిరంకుశ పాలనకు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పేదలు, రైతులు, కూలీలు ఐక్యంగా పోరాడారని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ వంటి వీరనారులు ఆ పోరాటంలో ప్రజలకు ధైర్యం, స్ఫూర్తిని అందించారని,తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా పేద రైతులకు భూమి పంపిణీ కోసం ఉద్యమం జరిగిందని, వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, ఉద్యమకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఆ మహత్తర పోరాటం కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయమని పేర్కొన్నారు. ఈ మహత్తరమైన పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపడం పంచడం జరిగింది అలాగే ఈ పోరాటంలో 4000 మంది కార్యకర్తలు అమరులైనారన్నారు.చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత కార్మికులు, యువతపై ఉందన్నారు. దోపిడీ, అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. ప్రదీప్ కుమార్, ఎం. మనోహర్, కే. సదాశివరెడ్డి, జీ. గణేశ్, సురేష్ కుమార్ తదితర యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
