చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు వాజిద్ అలీ

politics Telangana

చాకలి ఐలమ్మ ఆశయాలే మనకు స్ఫూర్తి

పేదల హక్కుల కోసం పోరాడుదాం!

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు వాజిద్ అలీ అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) పటాన్‌చెరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక్ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఆమె అడుగుజాడల్లో ముందుకు వెళ్దాం అన్నారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా నిలబడి పోరాడారని గుర్తు చేశారు. తన భూమిని, తన హక్కులను కాపాడుకోవడానికి ఆమె చూపిన తెగువ పేదలు, రైతులు, మహిళలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ, సమాజంలో దోపిడీ, వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, పేదల ఆత్మగౌరవానికి, మహిళల ధైర్యానికి, భూమి కోసం జరిగిన రైతాంగ పోరాటానికి ప్రతీక అని అన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పటాన్‌చెరు ఏరియా కమిటీ సభ్యులు మల్లేష్, మూర్తి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి. అర్జున్, ఎస్ఎఫ్ఐ పటాన్‌చెరు డివిజన్ కార్యదర్శి శంసుంగ్, ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *