సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
ఆకలి తీర్చడమే లక్ష్యం అన్నదానమే సేవా మార్గం అని నమ్మిన వ్యక్తినని సాయి లక్ష్మి డాక్యుమెంట్ రైటర్ చైర్మన్, సమాజసేవకుడు సాయిరాం గుప్తా అన్నారు .పటాన్‌చెరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో ప్రతి నెల అమావాస్య సందర్భంగా తన మిత్రబృందంతో కలిసి వందలాది మందికి ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తూ సేవా స్ఫూర్తిని చాటుతున్నారు.గత కొంతకాలంగా క్రమం తప్పకుండా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమంలో ముందుగా స్థానిక సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పేదలు, బాటసారులు, నిరుపేదలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.అనంతరం సాయిరాం గుప్తా మాట్లాడుతూ అమావాస్య రోజున ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. పేదలు, నిరుపేదలు, బాటసారులకు స్వచ్ఛమైన, పౌష్టికాహారాన్ని ప్రసాదంగా అందించడంలో ఎంతో తృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. సాయిబాబా ఆశీస్సులతో, మిత్రులు, దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తన గురువర్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మిత్రుడు గూడెం విక్రమ్ రెడ్డిలకు సాయిరాం గుప్తా తన మిత్రబృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగరాజు గాంధీ, జగదీశ్వర్ రెడ్డి, సతీష్ రెడ్డి, శివారెడ్డి, ఎంజాల శ్రీను, రమేష్, చంద్రయ్య, స్నేహ, సాబీర్ తదితరులతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, స్వచ్ఛంద సేవకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
