మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
భవిష్యత్ తరాలకు స్వచ్ఛ హరిత సమాజాన్ని నిర్మిద్దామని కృష్ణవేణి పాఠశాల కరస్పండేంట్ నాగరాజు అచ్చి అన్నారు.గ్రీన్ డే పురస్కరించుకొని మంగళవారం పటాన్ చెరు పట్టణం లోని సీతారామపురం కాలనీలోని కృష్ణవేణి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ నాగరాజు అచ్చి ఆధ్వర్యంలో గ్రీన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో పాఠశాల ప్రాంగణాన్ని ఆకుపచ్చ రంగులతో బెలూన్లు, మొక్కలు, పర్యావరణ సందేశాలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉత్సాహంగా గ్రీన్ డే వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నాగరాజు అచ్చి మాట్లాడుతూ”ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నప్పటి నుంచే పిల్లల్లో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో స్వచ్ఛమైన, హరిత సమాజాన్ని నిర్మించగలుగుతామన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పాటలు, నృత్యాలు, సందేశాత్మక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
