మనవార్తలు ,వరంగల్
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే అని వి 10 టీవీ తెలుగు చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రముఖ దేవాలయం మేడారం లో సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్న టీవీ 10 టీవీ చైర్మన్ వి సురేష్ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు . ప్రబల్లుతున్న కరోన , ఓమిక్రాన్ వైరస్ వల్ల,రెండు రాష్ట్రాల మరియు దేశ ప్రజలఅందరు సుభిక్షంగా ఉండాలని ఎటువంటి హాని కలగకూడదని, ఈ మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించికొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మాట్లాడుతూమేడారం సమ్మక్క సారక్క జాతర అంటే రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు వస్తారని కోర్కెలుతీర్చే కొంగు బంగారం అని వి 10 టీవీ తెలుగు చైర్మన్, అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.సురేష్ కుమార్అన్నారు.
