మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం కల్పించడం కోసం అంబలి, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు 1996 – 97 ఎస్ ఎస్ సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తెలిపారు. మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలో ఎంతో పురాతనమైన
మహిమ గల బేతాళ స్వామి జాతర ఎంతో ఘనంగా జరపడం ఆనవాయితీ గా వస్తుంది. జాతరకు చుట్టూ పక్కల గ్రామాలతో పాటు, సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, జహీరాబాద్, బీదర్ ఇంకా ఇతర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఎడ్ల బండ్లు తప్పడం బాగా ప్రాచుర్యం పొందింది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తమ వంతు సాయంగా ఈ అంబలి, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
