పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ మరియు యువజన వికాస సమితి అధ్యక్షులు అడ్వకేట్ విజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి శివానందం గారు కృషి చేయాలని ఆకాంక్షించారు. గతంలో సర్పంచ్‌గా పాలన అందించిన అనుభవం ఉన్న శివానందం గారు, ఇప్పుడు పటాన్‌చెరు లాంటి అతిపెద్ద మార్కెట్ కమిటీకి చైర్మన్‌గా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.​రైతు సంక్షేమమే ధ్యేయంగా, మార్కెట్ కమిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించాలని, ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తనను సన్మానించిన మెట్టు శ్రీధర్ మరియు విజయ్ కుమార్ గారికి చైర్మన్ శివానందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మార్కెట్ కమిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *