నిరుపేదలకు వరప్రదాయని ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

91 మంది లబ్ధిదారులకు 39 లక్షల 42 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేదలకు వరప్రదాయనిగా నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 39 లక్షల 42 వేల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్సలు, ప్రమాదాలు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అనేక నిరుపేద కుటుంబాలు ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను చేరవేయడంలో కట్టుబడి ఉన్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వారి గడప వద్దకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అంశంలో దళారులను ఆశ్రయించ వద్దని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, అంతిరెడ్డి, శ్రీకాంత్, నారాయణరెడ్డి, దుర్గారెడ్డి, రామచందర్, మేరాజ్ ఖాన్, వెంకటేష్, వెంకటేష్ నాయక్, నిజాముద్దీన్ బాబా, సల్మాన్, వినోద్, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *