– విద్యా హై స్కూల్ లో పూసిన కుసుమాలు
మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రాథమిక దశలోనే విద్యా ప్రతిష్టంగా ప్రతిష్ఠంగా ఉండాలి. అలాంటి సిద్ధాంతాన్ని నమ్మిన స్కూల్ డైరెక్టర్ త్రిమూర్తులు పొన్నాడ సారధ్యంలో విద్యార్థులు దూసుకుపోతున్నారు. ఈ సారి వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో గణనీయమైన మార్కులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించి స్కూల్ కు ఉన్న విద్యా అనే పేరును నిలబెట్టారు. అంకుటిoత దీక్షా, పట్టుదల, కష్టపడే మనస్తత్వం ఉన్న అధ్యాపక బృందం, సాధించాలనే పట్టుదల గల విద్యార్థులు ఉండడం వల్లే ఈ ఫలితాలు రావడానికి కారణమయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈసారి మంచి ఫలితాలు సాధించిన నీతు చౌదరి 576, రoషా ఖాన్ – 555, పి. స్రవంతి – 544, రహీమా భాను – 539, సందీప్ – 527, ఫయీజ్ హుస్సేన్ – 510, జె. గీతిక – 503, సబిత – 501 విద్యార్థులతో పాటు విజయం సాధించిన విద్యార్థులoదరిని త్రిమూర్తులు అభినందించారు.
కార్పొరేట్ సంస్థల కు ధీటుగా ఫలితాలు – త్రిమూర్తులు పొన్నాడ
పెరుగుతున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకొని కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా తమ స్కూల్ విద్యార్థులు విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికనుగుణగా విద్యా బోధన చేస్తున్న తమ బృందానికి ఎప్పటికప్పుడు సరైన సూచనలిస్తూ అన్నిరంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
