సమిష్టి సహకారంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

ప్రతి వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..

ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి

పూర్తి పారదర్శకతతో నిధుల కేటాయింపు

ప్రశాంతంగా ముగిసిన కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

బిఆర్ఎస్ ఖాతాలో నాలుగు కో ఆప్షన్ పదవులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడంతోపాటు.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాలకవర్గానికి సూచించారు. శనివారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమానికి హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిఆర్ఎస్ తరపున ప్రతిపాదించిన విష్ణువర్ధన్ రెడ్డి, బండ సోనియా, నిజాముద్దీన్ బాబా, ఆసియా బేగంలు పూర్తి మెజారిటీతో కో ఆప్షన్ సభ్యులుగా ఎంపికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్ తమ వార్డు పరిధిలో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిబద్దతతో పని చేయాలని కోరారు.

ఇప్పటికే 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని అతి త్వరలో వీటికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. అధికార, ప్రతిపక్షం అని తేడా లేకుండా ప్రతి వార్డుకి సమస్థాయిలో నిధుల కేటాయింపులు చేయాలని పాలకవర్గానికి సూచించారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తూ పారదర్శక పరిపాలన అందించాలని సూచించారు.

నూతన కోఆప్షన్ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుమలత, కమిషనర్ వెంకట కిషన్, సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, కౌన్సిలర్లు మమత, వెంకటేష్. ఆంజనేయులు. రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి, మంజుల, సంధ్య, నరేందర్ రెడ్డి, పాండు, లత, రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *