ముగ్గురికి రూ. 7.20 లక్షల చెక్కులు అందజేత
మనవార్తలు ప్రతినిధి , రామచంద్ర పురం :
ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న సామాన్యులకు ఎల్ఓసి ఒక గొప్ప వరం అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్ర పురంకు చెందిన ముగ్గురు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రమంలో లబ్ధిదారులకు మొత్తం రూ. 7.20 లక్షల విలువైన ఎల్ఓసి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఓసీ పేదల పాలిట సంజీవనిలా మారిందని, అత్యవసర సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి ఖర్చులు భరించలేక అప్పుల పాలు అవుతున్న కుటుంబాలకు ఎల్ఓసీ భరోసా అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, ఎమ్మెల్సీ ఆఫీస్ లో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.

నూతన కో-ఆప్షన్ సభ్యుడికి అభినందనలు
జిన్నారం మున్సిపాలిటీ ఎన్నికైన నూతన కో-ఆప్షన్ సభ్యులు నర్సింగరావు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఎమ్మెల్సీ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్సీ శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జిన్నారం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కో-ఆప్షన్ సభ్యుడిగా కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పాలకమండలితో కలిసి పని చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ముందుండాలని సూచించారు.
