అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించిన _శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్, బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025 – 2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం సన్మానించారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం మాట్లాడుతూ పదవ తరగతిలో ప్రవేట్ స్కూల్ లకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలను రావడం శుభ పరిమాణం అని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రతిభ కలిగి ఎక్కువ అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని అందువల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు బాగా చదువుకొని వారి తల్లిదండ్రులకు మరియు మన రామచంద్రపురం పట్టణానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు .విద్యార్థి దశలోనే ఎక్కువగా కష్టపడి చదివితే మీ భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయి కి చేరుకుంటారు అని అన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు.రోహిత్ (564), సంగమేశ్వేర్(554), రాజేశ్వరి (529)లను ప్రశంసించారు. విద్యార్థినీ, విద్యార్థులకు పదో తరగతి జీవితం మలుపు తిప్పే కీలక దశ అని పేర్కొన్నారు. పదో తరగతిలో సాధించే ఫలితాలే భవిష్యత్ విద్యాభ్యాసానికి బలమైన పునాది అవుతాయని, లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొంటూ, విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్ కోసం తమవంతు సహకారం అందిస్తూనే ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పిపి రాథోడ్ , సౌభాగ్య శ్రీనివాస్ గౌడ్ , తుకారం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *