ముత్తంగి సమగ్ర అభివృద్ధికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

రెండు కోట్ల 37 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో రెండు కోట్ల 37 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగు నీటి కాలువలు, బోర్ వెల్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, రక్షిత మంచినీటి వసతులు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముత్తంగి డివిజన్ ను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనుల కోసం దశలవారీగా నిధులు కేటాయిస్తూ నిర్దేశిత గడువుగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, ఇంజనీరింగ్ విభాగం డిఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కిట్టు, మేరాజ్ ఖాన్, సందీప్, ఆబీద్, రామకృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *