కడప
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్న కప్పల పల్లె గ్రామానికి చెందిన ఆర్. సి. యం ఎయిడెడ్ ఎంపీపీ పాఠశాల లో పనిచేయుచున్న ఉపాధ్యాయురాలు కృష్ణ కుమారి గారు పాఠశాలకు సమయానికి రాకుండా ఇష్టం వచ్చినట్టు మధ్యాహ్న భోజన పథకం ప్రకారం పెట్టకుండా ఇష్టానుసారంగా పెడుతూ విద్యార్థులకు నష్టం కలిగిస్తున్నారు. పాఠశాలకు వచ్చి విద్యార్థులకు చదువు చెప్పకుండా పక్కనే ఉన్నా రేకుల షెడ్ లో నిద్రిస్తూ ఇంటికి వెళ్ళే సమయం కాకుండానే ఇంటికి వెళుతూ విద్యార్థుల చదువు పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు లు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాపోయారు. దీని గురించి ఎస్ఎఫ్ఐ బృందం అక్కడికి వెళ్లి మేడం గారిని అడగగా మీకు ఏ అదికారం ఉందని మీరు అడుగుతున్నారు.
మీరు ఏమన్నా DEO నా లేదా MEO నా, అని మీకు నన్ను అడగడానికి ఎలాంటి రైట్స్ లేవు అని ఎస్.ఎఫ్.ఐ నాయకుల పైన దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మూడు రోజులైనా కూడా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిగ్గుచేటుగా ఉంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి శైలజ మేడం గారు స్పందించి ఉపాధ్యాయురాలు కృష్ణకుమారి గారిని సస్పెండ్ చేయాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి లు డిమాండ్ చేశారు . లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడతామని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో కడప నగర అధ్యక్షుడు సురేష్ , తదితరులు పాల్గొన్నారు.