మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మారబోయిన బిక్షపతి యాదవ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .నియోజకవర్గంలో ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర యువ నాయకులు రవి కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, అందులో భాగంగా గురువారం రోజు మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ జన్మదినం సందర్భంగా ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో సుమారు రెండువందల మంది భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం ప్రధాన కార్యదర్శులు గుండె గణేష్ ముదిరాజ్ జాజేరావు శ్రీను గంగారాం మల్లేష్. జాజేరావు రాము. రేపాన్ వెంకటేష్.సారా రవీందర్ డి.దేనేష్ చంద్ర మాసిరెడ్డి. జాజేరావు శ్రీధర్. రాజేందర్.వంశీ. బి. రమేష్ నీలకంఠం. జాన్ రెడ్డి.దుర్గేష్.శేఖర్. మరియు తదితరులు తదితరులు ఆర్ కె వై టీం సభ్యులు పాల్గొన్నారు.