మహానగర అభివృద్ధికి ఆధ్యుడు కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్_ నీలం మధు ముదిరాజ్..

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్ నగర తొలి మేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఆధ్యుడు అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. కొరవి కృష్ణస్వామి 137 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని చిట్కుల్లోని ముదిరాజ్ సంఘం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నీలo మధు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల ముద్దుబిడ్డ మహానేత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ అని ఆయన హైదరాబాద్ మహానగర అభివృద్ధికి అనితర సాధ్యంగా కృషి చేశాడన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కవిగా, జర్నలిస్టుగా, పేదోళ్ల నాయకుడిగా ప్రజల మనసు దోచుకున్నాడని తెలిపారు. హైదరాబాద్ తొలి మేయర్ గా సేవలందించిన సమయంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసి మహానగర అభివృద్ధిపై చెరగని ముద్ర వేసిన ఘనత ఆయనకే సొంతమన్నారు. ముదిరాజ్ జాతి ఐక్యత కోసం ముదిరాజ్ మహాసభ సంఘాని స్థాపించి మన జాతి అభివృద్ధి కోసం ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఆ మహానేత స్ఫూర్తితో మనమంతా కలిసి ముందుకు సాగాలన్నారు.ఆయన అందించిన పోరాటస్ఫూర్తితో ముదిరాజులంతా రాజకీయంగా,సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ గ్యారేల శీను, వి నారాయణ రెడ్డి, పొట్టి నారాయణ రెడ్డి,వెంకటేశ్,గోపాల్,శ్రీనివాస్, రాము,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *