మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీనీ అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరంబండ, ఐనోలు, ఇంద్రేశం, బచుగూడెం వార్డులలో 15 కోట్ల రూపాయల అంచనా చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను ఆదివారం ఉదయం స్థానిక మున్సిపల్ పాలకవర్గం తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని 5 మున్సిపాలిటీలలో ప్రజలు నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డు పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.నూతన కాలనీలలో సీసీ రోడ్లు, యూజీడీలు, పార్కులు, రక్షిత మంచినీరు అందించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు.నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కుశంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పట్లోల్ల హరీష్ రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రా రెడ్డి, కౌన్సిలర్లు అంతిరెడ్డి,లావణ్య, పట్లోల లత రెడ్డి, పాశం ఊర్మిళ రెడ్డి, రమేష్, చిమల్ధారి రమేష్, పట్లోల్ల అంజలి రెడ్డి, అంబిలి, కో ఆప్షన్ సభ్యులు శివారెడ్డి, సుమతి, సల్మాన్ ఖాన్, నసీమ బేగం, మాజీ ప్రజా ప్రతినిధులు శంకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి, రామచందర్, నర్సింలు, జంగారెడ్డి, బండి శంకర్, అనిల్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
