మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
అందరికి ఆరోగ్యం బాగుండాలనే సదుద్దేశం తోకంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్, బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొల్లూరులో కేర్ ఆండ్ క్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్ మరియు అందరికీ భోజన సదుపాయాలు కల్పించినట్లు కృష్ణ మూర్తి చారి తెలిపాడు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సునంద కృష్ణమూర్తి, శ్రీనివాస్, సాయివెంకట హర్ష, మహిళా సంఘం తరపున అంజలి, అనసూయ, అలివేలు, ఊర్మిల, సి.హెచ్.సతీష్ గౌడ్, పి. సతీష్ గౌడ్, డాక్టర్లు పృథ్వి, సాహిత్, కల్పన, నర్సింగ్ స్టాఫ్ విభాగానికి చెందిన స్వాతి, భార్గవి, రోహిత, శిల్ప, పవిత్ర, ల్యాబ్ టెక్నీషియన్స్ మహేష్ ఫార్మసీ విభాగానికి చెందిన లోకేష్ తదితరులు పాల్గొన్నారు.