ఇండియన్ డాగ్స్ చాలా మంచివి అని రష్మి గౌతమ్
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2026:* పెంపుడు జంతువులకు ఆధునిక వైద్య సేవలను అందించేందుకు హైదరాబాద్‌లో ‘ది యానిమల్ ప్లేస్’ వెటర్నరీ క్లినిక్* ప్రారంభించిన్న సినీనటి, టీవీ యాంకర్ రష్మి గౌతమ్. డాక్టర్ సలీం మస్కటి, డాక్టర్ మార్షా గాబ్రియేల్ స్థాపించిన ఈ ఆధునిక వెటర్నరీ క్లినిక్ శ్రీనగర్ కాలనీలోని అందుబాటులోకి వచ్చింది.
“మోడ్రన్ మెడిసిన్, జెన్యూయిన్ కంపాషన్” అనే సిద్ధాంతంతో క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కుక్కలు, పిల్లులు తదితర పెంపుడు జంతువులకు ఒకే చోట సమగ్ర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లినిక్‌ను తీర్చిదిద్దారు.ఇక్కడ సాధారణ వైద్య సంప్రదింపులు, వ్యాక్సినేషన్లు, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఇన్-హౌస్ ల్యాబొరేటరీ, శస్త్రచికిత్సలు, డెంటల్ కేర్, ఇంటర్నల్ మెడిసిన్, అత్యవసర వైద్యం, గ్రూమింగ్, ఇన్-హౌస్ ఫార్మసీతో పాటు పెంపుడు జంతువులకు అవసరమైన ఉత్పత్తులతో ప్రత్యేక పెట్ స్టోర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

*ది యానిమల్ ప్లేస్ హెడ్ సర్జన్, ఫౌండర్ డాక్టర్ సలీం మస్కటి* కు సాఫ్ట్ టిష్యూ, ఆర్థోపెడిక్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ రంగాల్లో దాదాపు పదేళ్ల అనుభవం ఉంది. *ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫౌండర్ డాక్టర్ మార్షా గాబ్రియేల్* యానిమల్ న్యూట్రిషన్లో మాస్టర్స్ పూర్తి చేసి, పెంపుడు జంతువుల నివారణ వైద్యం, వ్యక్తిగత పోషకాహార ప్రణాళికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
పెంపుడు జంతువుల పూర్తి వైద్య చరిత్రను ఒకే వైద్య బృందం నిర్వహించడం ద్వారా నిరంతర వైద్య సేవలు అందించడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. క్లినికల్ ఎక్సలెన్స్‌తో పాటు జంతువుల పట్ల ప్రేమ, పారదర్శకత, సమగ్ర ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు పేర్కొన్నారు.పప్పీకి మొదటి వ్యాక్సినేషన్ నుంచి వృద్ధ పెంపుడు జంతువుల ఆరోగ్య పరీక్షలు, డెంటల్ కేర్, ప్రత్యేక వైద్యం, శస్త్రచికిత్సల వరకు అన్ని రకాల సేవలను ఒకే చోట అందిస్తూ హైదరాబాద్‌లో పెట్ హెల్త్‌కేర్‌కు వన్‌స్టాప్ డెస్టినేషన్‌గా నిలవాలని ‘ది యానిమల్ ప్లేస్’ లక్ష్యంగా పెట్టుకుంది.
