హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక శైలిని ప్రతిబింబిస్తున్నాయ‌ని సినీన‌టి మంచు ల‌క్ష్మీ అన్నారు .హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్ర‌ముఖ ల‌గ్జ‌రీ ఆభ‌ర‌ణాల బ్రాండ్ హౌస్ ఆఫ్ రోజ్ ఏర్పాటు చేసిన హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను హౌస్ ఆఫ్ రోజ్ వ్యవస్థాపకులు బీరెన్ వైద్య తో క‌లిసి ప్రారంభించారు .సాంప్రదాయ ఆభరణాల ప్రదర్శనకు భిన్నంగా హౌస్ ఆఫ్ రోజ్ షోకేస్ ఉంద‌న్నారు . ఒక్కో ఆభ‌ర‌ణం ఒక క‌థ‌ను చెబుతుంద‌ని ఇలాంటి వాటిని హైద‌రాబాదీయులు ఆద‌రిస్తార‌ని తెలిపారు . హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌కు మంచి ఆద‌ర‌ణ‌, ప్ర‌శంస ల‌భించింద‌ని సంస్థ ఫౌండ‌ర్ బీరెన్ వైద్య తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *