సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రపురం :

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం అన్నారు. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం 268 డివిజన్లో గల శ్రీనివాస్ నగర్ కాలనీలో బాలవిహార్ పార్క్ ముందు ఉన్నటువంటి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించిన శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం మాట్లాడుతూ కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతపట్టి దొరల గడీల అహంకారాన్ని బద్దలు కొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ధైర్యశాలి. నా భూమి నాది. నా చెమటొడ్చి పండించుకున్న పంట నాది దొరలకు తలవంచేది లేదు అని అన్నారుఈ కార్యక్రమంలో రజక సంఘం రామచంద్రపురం పట్టణ శాఖ నాయకులు చాకలి నరసింహ, ప్రభు, చాకలి లింగయ్య, శ్రీనివాస్, సాయి, అంజయ్య, బిక్షపతి కృష్ణ, సుధాకర్, కరిక కృష్ణ, తుకారం, అనిల్, సతీష్, రజక సంఘం సభ్యులు,తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *